పరిశుభ్రమైన వాతావరణం అవసరం | The need for a clean environment | Sakshi
Sakshi News home page

పరిశుభ్రమైన వాతావరణం అవసరం

Oct 30 2014 3:16 AM | Updated on Aug 9 2018 4:39 PM

పరిశుభ్రమైన వాతావరణం అవసరం - Sakshi

పరిశుభ్రమైన వాతావరణం అవసరం

నెల్లూరురూరల్ : అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.

నెల్లూరురూరల్ : అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని 37వ డివిజన్ క్రాంతినగర్, 38వ డివిజన్ పొట్టేపాళెంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఐదేళ్లలో అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు.

పేద కుటుంబాల్లోని పిల్లలందరూ చదువుకోవాలన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలెందరో మేధావులు అయ్యారన్నారు. ప్రస్తుత ప్రధాని కూడా ఒకప్పుడు పేదవాడేనని పేర్కొన్నారు. అర్హులకు ప్రతి ఒక్కరికీ పెన్షన్‌లు అందేలా చూస్తామన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. రైతు, డ్వాక్రా, రుణాల మాఫీ, యువకులకు నిరుద్యోగ భృతి హామీని సీఎం ఆచరణలో అమలు చేయాలన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. పొట్టేపాళెం హైస్కూల్‌లో అదనపు గదులు మంజూరు చేయాలని బొమ్మిరెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరడంతో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

 ప్రజా సంక్షేమమే ధ్యేయం:
 రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

 ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుంటే వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలి తప్ప మిగతా సమయాల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు. అర్హులైన పింఛన్‌దారుల్లో ఒక్కరికి తొలగించినా సహించబోమన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రి నారాయణ సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

పజల కష్టాలు తెలుసుకునేందుకు ఎల్లప్పుడు వారికి అం దుబాటులో ఉంటామన్నారు. పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉంటామన్నారు. అనంతరం పెన్షన్లు పంపిణీ చేశారు. 37వ డివిజ న్‌లో కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, లేబూరు పరమేశ్వరరెడ్డి, ఏకసిరి ప్రశాంత్‌కిరణ్, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు తాటివెంకటేశ్వరరావు, నాయకులు బుర్రా వెంకటేశ్వర్లుగౌడ్, మహేష్ పాల్గొన్నారు.

 వాటర్‌ప్లాంట్ ప్రారంభం
 పొట్టేపాళెంలో నిర్మించిన ఎన్‌టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు లాంఛనప్రాయంగా ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement