అగ్ని ప్రమాదంలో 17 పూరిళ్లు బుగ్గి | The fire burned 17 Huts | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో 17 పూరిళ్లు బుగ్గి

Dec 26 2015 8:52 AM | Updated on Sep 5 2018 9:45 PM

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపాలకృష్ణాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపాలకృష్ణాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో లేచిన మంటలు వేగంగా పక్కనే ఉన్న పూరిళ్లకు వ్యాపించాయి. అర్ధరాత్రి గాఢ నిద్ర సమయంలో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఇళ్లల్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. మొవ్వ, ఉయ్యూరు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం 17 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement