సామాజిక న్యాయం కోసమే తెలంగాణ ఇచ్చాం | The Congress party's victory in the struggle | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయం కోసమే తెలంగాణ ఇచ్చాం

Mar 10 2014 4:08 AM | Updated on Sep 2 2017 4:31 AM

తెలంగాణ రాష్ట్రం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించిన జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాంరమేశ్ రాక సందర్భంగా ఆదివారం నగరకాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో సంబరాలు జరిగాయి.

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించిన  జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాంరమేశ్ రాక సందర్భంగా ఆదివారం నగరకాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో సంబరాలు జరిగాయి. సభ అనంతరం కనివినీ ఎరగని రీతిలో దాదాపు రెండుగంటలపాటు బాణాసంచా పేలుళ్లతో జిల్లా కేంద్రం మారుమోగింది. ఆకాశంలో అద్భుత విన్యాసాలతో నగరవాసులంతా ఇళ్లనుంచి బయటకు వచ్చి బాణాసంచాల పేలుళ్లను ఆసక్తిగా చూశారు.
 
 చిన్నపిల్లలు కేరింతలు కొట్టారు. మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రదేశం నుంచి బాణాసంచా పేల్చారు. అక్కడే టపాసులతో ‘జై తెలంగాణ..జైసోనియా...జై కాంగ్రెస్...జైరాం..’అన్న అక్షరాలు రావడం సభికులను అబ్బురపరిచింది. క్రాకర్స్‌షోను కేంద్రమంత్రి జైరాం రమేశ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆసక్తిగా వీక్షించారు.
 
 జైరాం రమేశ్‌కు ఘనస్వాగతం
 తెలంగాణ బిల్లును రూపొందించి రాష్ట్ర ఏర్పాటులో ప్ర ధానపాత్ర పోషించి తొలిసారి జిల్లాకు వచ్చిన జైరాంరమేశ్‌కు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం ల భించింది. బైపాస్‌రోడ్డు వద్ద స్వాగతం పలికిన అనంత రం, ఓపెన్‌టాప్ జీబులో జైరాంరమేశ్‌ను బైపాస్, కో తిరాంపూర్, కమాన్‌చౌరస్తా, సిక్‌వాడి, బస్టాండ్ మీదు గా ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మార్గంమధ్యలో మహిళలు, యువకులు, తె లంగాణ వాదులు జైరాంరమేశ్‌కు అభివాదం చేశారు.   మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎం పీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, విప్ ఆరెపల్లి మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్న కృష్ణ తదితరులు ఉన్నారు.ాంపూర్, కమాన్‌చౌరస్తా, సిక్‌వాడి, బస్టాండ్ మీదు గా ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మార్గంమధ్యలో మహిళలు, యువకులు, తె లంగాణ వాదులు జైరాంరమేశ్‌కు అభివాదం చేశారు.   
 
 మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎం పీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, విప్ ఆరెపల్లి మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్న కృష్ణ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement