జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా అవార్డులు పొందిన జిల్లాకు చెందిన ఉర్దూ ఉత్తమ ఉపాధ్యాయులకు యునెటైడ్ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఉమా) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
వైవీయూ, న్యూస్‌లైన్ : జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా అవార్డులు పొందిన జిల్లాకు చెందిన ఉర్దూ ఉత్తమ ఉపాధ్యాయులకు యునెటైడ్ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఉమా) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం నగరంలోని డీసీఈబీ సమావేశ మందిర ప్రాంగణంలో ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశానికి నిర్ధేశకులు ఉపాధ్యాయులేనన్నారు.
మంత్రి తనయుడు అషఫ్ ్రమాట్లాడుతూ వచ్చేయేడాది కూడా సమైక్యాంధ్రలోనే అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉమా అధ్యక్షుడు షంషుద్దీన్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి అవార్డులు పొందడం గొప్పవిషయమన్నారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఎస్.ఏ. హకీం, ఇర్షాద్‌అహ్మద్, అఫ్జల్‌బాషా, అంజద్‌అలీలను అతిథులు దుశ్శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పర్యవేక్షకుడు ఫరూఖ్‌అహ్మద్, ఉమా ఉపాధ్యక్షుడు మహబూబ్‌ఖాన్, సభ్యులు దేవదానం, ఖాదర్, గౌస్‌పీర్, మహబూబ్‌బాషా, ఇంతియాజ్, సుకుమార్, చాన్‌బాషా పాల్గొన్నారు.