తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన సుందరరాజస్వా మి వార్షిక అవతారోత్సవాలు బుధవా రం ఘనంగా ప్రారంభమయ్యాయి.
పెద్దశేషునిపై సుందరరాజస్వామి దర్శనం
తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన సుందరరాజస్వా మి వార్షిక అవతారోత్సవాలు బుధవా రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే అవతారోత్సవాల్లో మొదటి రోజైన బుధవారం రాత్రి స్వామి వారు పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.
అవతారోత్సవాల్లో భాగంగా స్వామిని వేకువనే సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామిని వేంచేపుగా ఆలయ ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదపారాయణం నడుమ ఉభయదేవేరులతో సహా స్వా మిని అభిషేకించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామికి ఊంజల్‌సేవ కన్నులపండువగా నిర్వహించారు.
రాత్రి 7.15 గంట లకు స్వామిని వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనం పై కొలువుదీర్చారు. అనంతరం దివ్యాలంకార శోభితుడైన స్వామి ఉభయదేవేరులతో సహా పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శ నం కల్పించారు. సుందరరాజస్వామి అ వతారోత్సవాల్లో భాగంగా రెండవ రోజై న గురువారం రాత్రి 7.15 గంటలకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ జరుగుతాయి.