జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
వైవీయూ, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 156 పరీక్షా కేంద్రాల్లో 33,232 మంది రెగ్యులర్ 1769 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను పర్యవేక్షించడానికి స్టేట్ అబ్జర్వర్, జిల్లా అధికారులు, స్క్వాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మంచినీరుతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు.
పరీక్ష కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పరీక్ష సమయం ఉదయం 9.30 గంటలకు కాగా అర్ధగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
ఓఎంఆర్ షీట్‌ను జాగ్రత్తగా నింపాలి.
ఇన్విజిలేటర్ బుక్‌లెట్ ఇచ్చిన వెంటనే బోర్డు వారిచ్చే స్టిక్కర్, పిన్నులు, ఇన్విజిలేటర్ సంతకం ఉండేలా సరిచూసుకోవాలి.
చేతిరాత ఆకట్టుకునేలా ఉంటే మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. చేతిరాత బాగుండేలా దృష్టిసారించాలి.
ప్రశ్నపత్రంలో తొలుత బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం తెలియని ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందవద్దు.
పది నిమిషాలు ముందే పరీక్ష పూర్తి చేసి సమాధాన పత్రాన్ని సరిచూసుకోవాలి.
పరీక్ష పూర్తయిన తర్వాత హాల్‌టికెట్ మరిచిపోకుండా వెంట తీసుకెళ్లాలి.