చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్తత నెలకొంది. రైతులను, డ్వాక్రా మహిళలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు సర్కార్పై ...
చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్తత నెలకొంది. రైతులను, డ్వాక్రా మహిళలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైన విషయం తెలిసిందే. రుణాల మాఫీపై చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిరసనగా గురువారం నుంచి మూడు రోజుల పాటు 'నరకాసురవధ' పేరుతో గ్రామాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేసి ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు.