సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత | Tension at Santakaviti MPDO Office | Sakshi
Sakshi News home page

సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Nov 5 2014 10:36 PM | Updated on May 29 2018 3:40 PM

శ్రీకాకుళ జిల్లాలోని సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

శ్రీకాకుళం: జిల్లాలోని సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయం  వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల హామీలు విస్మరించిన చంద్రబాబు నాయుడు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి పోరుబాట పట్టిన విషయం తెలిసిందే.  ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు  రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ధర్నాలలో భాగంగా సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు.

అధికారులు మాత్రం  స్పందించలేదు. ధర్నా కొనసాగుతూనే ఉంది. ధర్నా వద్దకు టీడీపి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement