కౌలు కష్టం దక్కనుంది

Tenant Farmers Will Benefit By YSRCP Scheme - Sakshi

భూయజమానికి నష్టం జరగకుండా 11 నెలలు సాగు ఒప్పందం

ఆనందం వ్యక్తం చేస్తున్నా కౌలు రైతులు

సాక్షి, కొమరాడ (విజయనగరం): పండించిన పంటకు మద్దతు లేక.. భూజమానికి కౌలు ఇవ్వలేక సతమతం అయిన కౌలు రైతున్నకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నేతృత్యంలో ప్రభుత్వం తీసుకున్నా నిర్ణయం నియోజవర్గంలో రైతులు వేలామంది కౌలు కష్టాలు తీరినట్లే. భూహక్కు దారుడికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు హక్కులు కల్పిస్తు 11 నెలలు సాగు ఒప్పంద ప్రతంతో అన్ని రాయతీలు, సదుపాయాలు, లాభాలు వర్తించి వారికి భరోసా ఏర్పుడినుంది.

కౌలు రైతుకు భరోసా...
సొంతంగా భూమిలేని ఎంతో మంది రైతులు భూ యజమానులు వద్ద  భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తు జీవనం కొనసాగుస్తున్నారు. సాగుకోసం కౌలు రైతులు భూజమానితో ఎన్నో ఇబ్బందుల ఎదుర్కొనుంటున్నాడు. కనీసం హక్కు ప్రతాలు కావాలని అడిగితే ఎక్కడ తమ భూమి కౌలు రైతుకు చెందిపోతుందో అని భయపడి తన ఆధీనంలో ఉంచుకుంటున్నారు భూ యజమానులు. దీంతో కౌలు రైతులకు కష్టం తప్ప లాభమేమి ఉండడం లేదు. ఇలాంటి సమయంలో జగన్న కౌలు రైతులు కష్టాలు నేరుగా తెలుసుకుని వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకరావడం గర్వహించే తగ్గ విషయం. ఈ చట్టం ద్వారా కౌలు రైతులు పంట నష్ట పోయిన ఇప్పుడు కౌలు రైతులు చెందితుంది.

కౌలు రైతు చేకూరే ప్రయాజనాలు
కౌలు రైతులు ముసాయదా బిల్లు వచ్చినందు వల్లన భూ యాజామాని ఎలాంటి ఇబ్బందులు కల్గికుండా11నెలలు కాల పరిమితం కూడిన సాగు ఒప్పందం ఉంటుంది. 
కౌలు రైతులు కూడా హక్కులు కల్పిస్తు అన్ని ప్రయోజనాలు చేకూరిలా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.12500పెట్టబడి సాయంతో పాటు ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట రుణం కూడా పొందే వెసులుబాటు. ఈ బిల్లు ద్వారా కౌలు రైతులు కలుగుతుంది.

ఎంతో సంతోషంగా ఉంది
కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ రాష్టం ప్రభుత్వం కౌలు రైతు ముసాదా బిల్లును తీసుకురావడం శుభపరిమాణం సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి రైతులు పట్ల ఎంతో ప్రేమ ఉంది, కౌలు రైతులకు ముసాయిదా బిల్లు ద్వారా కౌలు రైతులు హక్కులు కల్పించటమే  కాకుండా అన్ని రాయితీలు, ప్రయోజనలు వర్తింపజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం.
– రఘుమండల గౌరునాయడు, పరుశురాంపురం

ఆనందంగా ఉంది
కౌలు రైతులకు హక్కులు కల్పించడంతో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎళ్ల తరబడి కౌలుకు భూములు సాగు చేస్తున్నాం. పంటలు దెబ్బతినే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థతి లేకుండా అన్ని ప్రయోజనలు చేకూరిలా భరోసా వచ్చింది.
– ఆర్‌.ముత్యాలనాయుడు, పి.పురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top