కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి సమీపంలో బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు.
కోడుమూరు(కర్నూలు): కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి సమీపంలో బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు. డోన్ డిపో ఆర్టీసీ బస్సు బుధవారం సాయంత్రం సుమారు 40 మంది ప్రయాణికులతో కోడుమూరు నుంచి లద్దగిరి వైపు వెళుతోంది. వెంకటగిరి సమీపంలో ఆటోను తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో బస్సు రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కోడుమూరు ఆస్పత్రికి తరలించారు.