తెలుగుదేశం నేతల దీక్ష భగ్నం | Telugu Desam Party leaders offended initiated | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం నేతల దీక్ష భగ్నం

Aug 25 2013 4:07 AM | Updated on Sep 1 2017 10:05 PM

సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా టీడీపీ నేతలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసు లు భగ్నం చేశారు.

 సాక్షి, గుంటూరు: సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా టీడీపీ నేతలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసు లు భగ్నం చేశారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ గడచిన ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షచేపడుతున్న విషయం విది తమే. వారి ఆరోగ్యం క్షీణించడం వల్ల చికిత్స అనివార్యమై దీక్షవిరమించాలని వారిని కోరా రు.
 
 అంగీకరించని నేతలను బలవంతంగా పోలీసు సిబ్బంది అక్కడినుంచి తొలగించి జీజీ హెచ్‌కు తరలించాచు. సమాచారం 30 నిమిషాల ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, జె.ఆర్.పుష్పరాజ్, మన్నం సుబ్బారావు తదితరులు దీక్షాశిబిరానికి చేరుకుని కాసేపు నిలువరించడానికి యత్నించారు. అయినా పోలీసులు ఆస్పత్రికి బలవంతంగా తరలించారు. జీజీహెచ్‌కు తరలించిన టీడీపీ నేతలు శనివారం తమ దీక్షలను విరమించారు.  పార్టీ నేతలు వారిని పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement