తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఐడియల్’ | Telugu Book of Records in Ideal | Sakshi
Sakshi News home page

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఐడియల్’

Oct 25 2014 1:31 AM | Updated on Sep 2 2017 3:19 PM

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఐడియల్’

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఐడియల్’

స్థానిక ఐడియల్ స్కూల్ విద్యార్థులు 14 మంది ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు. సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ‘

జిన్నూరు (పోడూరు) : స్థానిక ఐడియల్ స్కూల్ విద్యార్థులు 14 మంది  ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు. సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ‘నైమిశ వేంకటేశ శతకం’లోని 108 పద్యాలను 1,850 మంది ఏకకాలంలో ఏక కంఠంతో గానం చేసిన శతకధారణ కార్యక్రమం ద్వారా తమ విద్యార్థులు ఈ ఘనత సాధించినట్టు కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. గుంటూరు సం పత్‌నగర్‌లోని శారదా పరమేశ్వరి ఆలయం లో ఈ నెల 19న ఈ కార్యక్రమం జరిగిందన్నారు. 1,850 మందిలో తమ విద్యార్థులు కలిగొట్ల మేఘన, యాండ్ర తేజస్వి, పెన్మెత్స రేణుక, బొర్రా మౌనిక, గోపరాజు కృష్ణలహరి, మల్లుల భావన, ఎస్.వెన్నెల, రావూరి నవ్యశ్రీ, సిరిమల్ల లక్ష్మీప్రియ, నుదురుపాటి సుబ్రహ్మణ్యం, సిరిమల్ల మణికంఠ కార్తీక్, ఎస్.శ్రీకార్తికేయ, మామడిశెట్టి బేబీ శ్రీ మంజు, కె.సాయిశ్రీ పవన్ ఉన్నారని చెప్పారు. వీరిని, శిక్షణనిచ్చిన టీచర్ మణిని అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement