బీజేపీ వల్లే తెలంగాణ: కిషన్‌రెడ్డి | telangana formed because of bjp, says kishan reddy | Sakshi
Sakshi News home page

బీజేపీ వల్లే తెలంగాణ: కిషన్‌రెడ్డి

Feb 23 2014 1:02 AM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీ వల్లే తెలంగాణ: కిషన్‌రెడ్డి - Sakshi

బీజేపీ వల్లే తెలంగాణ: కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు, సీమాంధ్రుల హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

సీమాంధ్రులకు న్యాయం కోసం పోరాడామని వ్యాఖ్య
హైదరాబాద్‌లో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు, సీమాంధ్రుల హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన అనంతరం.. కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు శనివారం తిరిగివచ్చారు. బీజేపీ నగర అధ్యక్షుడు వెంకటరెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సికిం ద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తరలివచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ నినాదాలు, కార్యకర్తల సందడితో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ఏర్పాటు విషయంలో అన్ని పార్టీలకు స్పష్టత లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉండడంతో పాటు, సీమాంధ్రులకు న్యాయం చేయడంలో పోరాడింది తమ పార్టీ మాత్రమేనని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల అభ్యున్నతి, ప్రగతి కోసం తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. కిషన్‌రెడ్డి వెంట ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బద్దం బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement