తెలంగాణ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెడితే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ మద్దతు ప్రకటిస్తుందని, ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత సీహెచ్.
తెలంగాణ ఏర్పాటు మైలురాయి : విద్యాసాగర్
Aug 18 2013 5:07 AM | Updated on Apr 7 2019 4:30 PM
జగిత్యాల, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెడితే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ మద్దతు ప్రకటిస్తుందని, ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత సీహెచ్. విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం జగిత్యాలలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా.. మూడు రాష్ట్రాలు ఇచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. 60 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్షంగా తాము పూర్తి స్వాగతిస్తున్నామన్నారు.
తెలంగాణకు అనుకూలమని చెప్పి మాటమార్చుతున్న పార్టీలతో వచ్చే ఇబ్బందులేమీ లేవన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అధిష్టానం ఆదేశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టంగా చెబుతున్నా.. అడ్డుకునేందుకు ప్రయత్నించడం అవివేకమన్నారు. అసెంబ్లీ తీర్మానంతో లింక్ పెట్టకుండా ఆర్టికల్-3 ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీఫ్ కుమార్, మోరపల్లి సత్యనారాయణ, బైరినేని అజిత్ కుమార్‌లు ఇతర నాయకులు
Advertisement
Advertisement