దళితుడిపై టీడీపీ నేత దాడి | TDP Leaders Attack On Dalit In West Godavari | Sakshi
Sakshi News home page

దళితుడిపై టీడీపీ నేత దాడి

May 24 2018 3:59 PM | Updated on Aug 10 2018 9:42 PM

TDP Leaders Attack On Dalit In West Godavari - Sakshi

గ్రామ కార్యదర్శిని తిడుతున్న టీడీపీ నేత

సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికార మదంతో తెలుగు తమ్ముళ్లు అడ్డూఅదుపు లేకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేత ఒకరు బరితెగించారు. కొమదవోలు గ్రామ కార్యదర్శి యువి రత్నంపై టీడీపీ నాయకుడు గంటా మోహనరావు దాడి చేశారు. ఇంటికి పిలిపించుకుని బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. పంచాయతీకి సంబంధించిన 5 లక్షల రూపాయిలను అడ్వాన్స్‌గా ఇవ్వలేదన్న అక్కసుతో కార్యదర్శిపై గూండాయిజం ప్రదర్శించారు.

దళితుడైన తనపై టీడీపీ నేత గంటా మోహనరావు దాడికి పాల్పడినట్లు బాధితుడు ఎన్జీఓ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దాడి విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఎన్జీఓ నేతలు నిర్ణయించారు. అధికారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement