'టిడిపి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిది' | TDP Leaders are mad men: Gattu Ramachandra Rao | Sakshi
Sakshi News home page

'టిడిపి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిది'

Nov 23 2013 4:46 PM | Updated on Aug 10 2018 9:40 PM

'టిడిపి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిది' - Sakshi

'టిడిపి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిది'

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు పిచ్చిపట్టినట్లు మాట్లడుతున్నారని, వారి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సలహా ఇచ్చారు.

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు పిచ్చిపట్టినట్లు మాట్లడుతున్నారని, వారి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన, సమైక్యత ఏదీ చెప్పలేక టిడిపి వారు పిచ్చిపట్టినవారిలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఏదీ స్పష్టంగా చెప్పలేని చంద్రబాబు ప్రజామద్దతు పొందలేకపోతున్నారని, జాతీయస్థాయిలో ఆయనను పట్టించుకునేవారు లేరని చెప్పారు. చంద్రబాబు ప్రజలతో పోరాడలేక, అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. హైటెక్ సిటీ ముందు ఫొటో దిగే హక్కు తనకే ఉందని చెబుతున్న చంద్రబాబు ఆ ఫొటోను పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. హైటెక్ సిటీ కట్టించిన ఎల్ అండ్ టి కంపెనీయే టిడిపి కార్యాలయం కట్టించిన విషయం మాత్రం చంద్రబాబు చెప్పరన్నారు. కోట్ల  రూపాయల  విలువ చేసే భూములను చంద్రబాబు ఐఎన్జికి అతి తక్కువ రేటుకు కట్టబెట్టారని చెప్పారు. హైదరాబాద్లో 14 ఫ్లైఓవర్లు కట్టించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన గుర్తు చేశారు.

ఈ నెల 26, 27 తేదీలలో  తుపాను బాధిత ప్రాంతాలలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. తుపాను ప్రాంతాలలో పర్యటన కారణంగా సమైక్యశంఖారావం వాయిదావేసినట్లు తెలిపారు. ఈ నెల 30 నుంచి సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement