
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం, అవినీతి కారణంగా పార్టీ వీడుతున్నారు. తాజగా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురజాలకు చెందిన టీడీపీ నేత వై మురళీధర్ రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. వైఎస్ జగన్ ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు.