పరారీలో  మాజీ విప్‌ కూన రవికుమార్‌

TDP Leader Kuna Ravi Kumar Escape - Sakshi

సాక్షి, ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండల కేంద్రంలో ఎంపీడీఓ, అధికారులను దుర్భాషలాడినందుకు గాను ఎంపీడీఓ మాజీ విప్‌ కూన రవికుమార్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మాజీ విప్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆమదాలవలస సీఐ ప్రసాద్‌రావు మీడియాకు వెల్లడించారు. కూన రవికుమార్‌తోపాటు మరో 11 మంది వ్యక్తులపై సెక్షన్‌ 353, 427, 506, 143, ఆర్‌డబ్ల్యూ 149, సెక్షన్‌ (3) పీడీపీపీ యాక్ట్‌ 1984 లతో కేసు నమోదు చేసినట్లు  సీఐ తెలిపారు. ప్రత్యేక పోలీసు దళాలతోపాటు డీఎస్పీ ఆమదాలవలస పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా మిగిలిన 11 మం ది వ్యక్తులతోపాటు కూన రవికుమార్‌ కూడా పరారైనట్లు పోలీసులు తెలిపారు.  రవికుమా ర్‌ ముందస్తు బెయిల్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసులలో ఉన్న వ్యక్తుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులను అయినా తీసుకువచ్చి నిందితులు ఆచూకీ తెలుసుకునేందుకు పోలీ సులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆఫీస్‌లోనే నన్ను బెదిరించారు..
స్పందన కార్యక్రమంలో విధుల్లో ఉన్నాను. అర్జీదారులతో మాట్లాడుతుంటే మాజీ విప్‌ రవికుమార్‌ కొంతమందితో వచ్చి మాపై దురుసుగా ప్రవర్తించారు. చెట్టుకు కట్టేసి కా ల్చేస్తా, తలుపులు వేసి బాదేస్తానని హెచ్చరించారు. దీని పై మా సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశాను.
– ఎ.దామోదరరావు, ఎంపీడీఓ, సరుబుజ్జిలి.

ఇలా అయితే ఉద్యోగాలు చేయలేం..
పింఛన్ల మంజూరు విషయంలో మాజీ విప్‌ రవి మాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పిన వారి దరఖాస్తులను విచారణ చేయకుండానే ఆన్‌లైన్‌ చేయాలని చెబుతున్నారు. లేదం టే ఉద్యోగాలు చెయ్యలేవని బెది రిస్తున్నారు. పరుష పదజాలంతో తిడుతున్నారు. ఇలా అయితే మేం ఉద్యోగాలు చెయ్యలేం.  
– పి.రాము, తెలికిపెంట పంచాయతీ కార్యదర్శి

క్షమాపణలు చెప్పాల్సిందే.. 
ప్రభుత్వానికి ప్రజలకు వారుధుల్లా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై రాజ కీయ నేతల దాడులు, బెదిరింపులు కరెక్ట్‌ కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా అందుకు తగ్టట్టుగా మేం పనిచేయాల్సిందే. అలాంటప్పుడు ఇలాంటి బెదిరింపులు చేస్తే సహించేది లేదు. సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరావు, ఇతర సిబ్బందిని కూన రవి దారుణంగా బెదిరించారు. వెంటనే క్షమాపణ చెప్పాలి. దీనిపై రాష్ట్ర ఉద్యోగుల సంఘ నేతలకు కూడా సమాచారం ఇచ్చాం. బాధిత ఉద్యోగులకు న్యాయం జరగకపోతే భవిష్యత్‌ పరి ణామాలు తీవ్రంగా ఉంటాయి. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top