మహిళా ప్రొఫెసర్‌ను తాను ఉద్దేశ పూర్వకంగా తాక లేదని, నిద్రమత్తులోనే కాలు తగిలి ఉండొచ్చని విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్‌రావు( చంటిబాబు) వివరణ ఇచ్చినట్లు....
హైదరాబాద్ : మహిళా ప్రొఫెసర్‌ను తాను ఉద్దేశ పూర్వకంగా తాక లేదని, నిద్రమత్తులోనే కాలు తగిలి ఉండొచ్చని విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్‌రావు( చంటిబాబు) వివరణ ఇచ్చినట్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(ఆర్‌జీఐఏ) సీఐ సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తన పట్ల వెంకటేశ్వరరావు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఢిల్లీకి చెందిన మహిళా ప్రొఫెసర్ రీతు వాసు ప్రిమలానీ ఈనెల 13 వ తేదీన ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు రావాలంటూ నోటీసులు పంపగా... ఆయన గురువారం రాత్రి ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరణ ఇచ్చినట్టు సీఐ తెలిపారు. దర్యాప్తు అనంతరం వెంకటేశ్వరావుపై చార్జీషీట్ నమోదు చేస్తామన్నారు.