వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను వారం రోజుల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు తెలిపారు.
మధిర, న్యూస్‌లైన్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను వారం రోజుల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేతకు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన దాదాపు పూర్తయిందని అన్నారు. ఉభయ ప్రాంతాల్లోని తెలుగు వారందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలన్నారు.
రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎవరు అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ప్రజలు ఓటు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. యువతకు ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందన్నారు. శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ రంగాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. ‘మధిర నుంచి మోత్కుపల్లి నర్సింహులు పోటీ చేస్తున్నారా..?’ అని, విలేకరులు ప్రశ్నిం చగా.. ప్రజాదరణ, సమర్థతగల అభ్యర్థిని మధిర నియోజకవర్గం బరిలో దింపుతామని బదులిచ్చా రు. సమావేశంలో మండల అధ్యక్షుడు మాదల రామారావు, నాయకులు చీదిరాల వెంకటేశ్వరరావు, యర్రగుంట రమేష్, చేకూరి శేఖ ర్‌బాబు, కట్టా కృష్ణార్జునరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.