తెలుగు తమ్ముళ్ల బరితెగింపు!

TDP Activists Try To Kabja In Rythu Bazar In west Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి :  ఏలూరులో  తెలుగు తమ్ముళ్లు  బరితెగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏలూరు వన్ టౌన్ రైతుబజార్ రహదారి వద్ద షాపు నిర్మాణం చేపట్టారు. అనుమతులు లేకుండా కడుతున్న షాపును రైతు బజార్ ఈవో శ్రీలత  అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు తమకు ఎమ్మెల్యే అనుమతి ఇచ్చారని ఈవో పై దౌర్జన్యానికి దిగారు. తాము ఎమ్మెల్యే బడేటి మనుషులం అంటూ వాగ్వాదానికి దిగారు. తమకు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిరంజన్ అనుమతులిచ్చారని ఆక్రమణదారులు  తెలిపారు. ప్రభుత్వ స్ధలాన్ని ఎలా కబ్జా‌ చేస్తారని‌ శ్రీలత  ప్రశ్నించారు. గతంలోనూ ఏలూరు పత్తేబాద రైతుబజార్‌ను ఆక్రమించారు. రైతుబజార్ లో కూరగాయల ధరలను అధికారులు కాకుండా ఎమ్మెల్యే బడేటి వియ్యంకుడు నిర్ణయించడాన్ని అడ్డుకోవడంతో పాటు పత్తేబాద ఆక్రమణలను అడ్డుకున్న శ్రీలతను  ఎమ్మెల్యే‌ బదిలీ చేయించారు.  తాజాగా వన్ టౌన్ రైతు బజార్‌ను సైతం ఎమ్మెల్యె మనుషుల ఆక్రమించారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top