‘నేతన్నల నిజమైన నేస్తం జగనన్న’

Talari Rangaiah Speech In Anantapur Over Nethanna Nestham - Sakshi

సాక్షి, అనంతపురం: కష్టాల్లో ఉన్న చేనేతలకు ఆపన్నహస్తం.. నేతన్న నేస్తం అని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. శనివారం ఆయన అనంతపురంలోని ఉరవకొండలో నిర్వహించిన ‘చేనేతల ఆత్మీయసభ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. రాబోయే ఐదేళ్లలో చేనేతరంగం దశ దిశలను సీఎం జగన్‌ మారుస్తారని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు ఏడాదికి రూ. 24 వేలు ప్రభుత్వం ఇస్తుందని రంగయ్య తెలిపారు.

అదేవిధంగా నేతన్నల నిజమైన నేస్తం జగనన్న అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చంద్రబాబు చేనేతలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అందరికి నేతన్న నేస్తం వర్తిస్తుందన్నారు. కార్మికుల ఉత్పత్తుల అమ్మకానికి ఈ-కామర్స్ దిగ్గజాలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top