సీఎం కిరణ్‌ను తొలగించాలి | t leaders demand remove kiran-kumar reddy | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్‌ను తొలగించాలి

Dec 31 2013 3:52 AM | Updated on Sep 2 2017 2:07 AM

సమైక్యాంధ్ర నినాదంతో ఒకే ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే తొలగించాలని

 మిర్యాలగూడ, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర నినాదంతో ఒకే ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంజాబ్, హ ర్యానా రాష్ట్రాల విభజన సమయలో ముఖ్యమంత్రులను తొలగించడంతో పాటు శాసనసభను రద్దు చేశారని గుర్తు చేశారు. ఇక్కడ కూడా అదే విధంగా వ్యవహరించాలన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో అధ్యాయనం పేరుతో శాసన సభ స్పీకర్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. స్పీకర్ తన వెంట డిప్యూటీ స్పీకర్‌ను కూడా తీసుకెళ్లకుండా రాజ్యాంగాన్ని అవమాన పర్చారన్నారు. 
 
 సీమాంధ్ర నాయకులు రాష్ట్రపతితో భేటీ కావడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.  బీజేపీని మతతత్వ పార్టీగా పేర్కొనే హక్కు గుత్తా సుఖేందర్‌రెడ్డికి లేదని చెప్పారు. కులం, మతం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కాంగ్రెస్ వారికే సాధ్యమన్నారు. రాబోయో ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.  సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఓరుగంటి రాములు, కర్నాటి ప్రభాకర్, కనగాల వెంకట్రామయ్య, వెదిరె శ్రీరాంరెడ్డి, చెరుపల్లి చంద్రమౌళి, బంటు సైదులు, వనం మదన్‌మోహన్, నూనె సులోచన తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement