లాఠీలు పట్టిన చేతులు చీపుళ్లు పట్టాయి. నేరాల అదుపుకు పాటుపడే వారు పరిసరాల పరిశుభ్రత కోసం నడుం వంచారు.
హైదరాబాద్ : లాఠీలు పట్టిన చేతులు చీపుళ్లు పట్టాయి. నేరాల అదుపుకు పాటుపడే వారు పరిసరాల పరిశుభ్రత కోసం నడుం వంచారు. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సీఐ కిరణ్ అధ్వర్యంలో బోయిన్‌పల్లి పోలీసులు తమ క్వార్టర్స్ సముదాయంలో గురువారం శ్రమదానం చేశారు.
కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ ఇన్స్‌పెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో పారిశుద్య సిబ్బందితో భూగర్భ డ్రైనేజీ పూడిక తీయించారు. విద్యుత్‌శాఖ అధికారులతో వేలాడుతున్న సర్వీసు వైర్లను తొలగింపజేసి నూతన తీగలు ఏర్పాటు చేయించారు. అనంతరం నార్త్‌జోన్ అదనపు డీసీపీ వీవైగిరి మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాలు నివసించే క్వార్టర్స్‌లో కంటోన్మెంట్ బోర్డు అధికారులు వీధి దీపాల ఏర్పాటు, పారిశధ్య సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.