‘ఆ పని చేయమని లోకేష్‌ను కోరుతున్నా’

SV Mohan Reddy Thanked the Chief Minister who Decided to Make Kurnool City a Judicial Capital - Sakshi

సాక్షి, కర్నూలు : నగరాన్ని జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారమే కర్నూలుకు న్యాయం జరిగిందని ఆయన వెల్లడించారు. దశాబ్దాల క్రితం జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సవరించారని ఆనందం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల వల్ల వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో పథకం ప్రకారం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపి బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి ఏర్పాటు చేసిన అమరావతిలో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్దిపథంలో దూసుకుపోతున్న జగన్‌ను చూసి చంద్రబాబు కడుపు రగిలిపోతోందనీ, ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు మతిభ్రమించి అసెంబ్లీలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఆయనను వెంటనే ఆసుపత్రిలో చూపించాలని లోకేష్‌బాబును కోరారు. మరోవైపు సర్పంచ్‌కు కూడా అర్హత లేని జనసేన అధినేత గురించి మాట్లాడుకోవడం వృథా అని తేల్చి చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top