అనంతపురం ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను అక్టోబర్‌లో కాకుండా జూలైలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు సంవత్సరం వృథా కాకుండా ఉంటుంది. అడ్మిషన్ నెంబరు ఆధారంగా పరీక్ష ఫీజు మీసేవా, ఏపీఆన్‌లైన్‌లో చెల్లించాలని డీఈఓ జనార్దనాచార్యులు, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు తెలిపారు. థియరీ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.150, ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు పదో తరగతికి రూ.50, ఇంటర్‌కు రూ.100 చెల్లించాలన్నారు. ఈనెల 11 నుంచి 16 వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. రూ.25 అపరాధ రుసుంతో 17, 18 తేదీల్లో, రూ.50 అపరాధ రుసుంతో 19, 20 తేదీల్లో చెల్లించవచ్చన్నారు.