ఆదివారం పాఠశాలలకు సెలవు లేదు | sunday no holiday of schools says deo ramalingam | Sakshi
Sakshi News home page

ఆదివారం పాఠశాలలకు సెలవు లేదు

Jun 20 2015 8:38 AM | Updated on Sep 3 2017 4:04 AM

బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాఠశాలలకు ఎటువంటి సెలవు లేదని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం స్పష్టం చేశారు.

ఒంగోలు వన్‌టౌన్:  బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాఠశాలలకు ఎటువంటి సెలవు లేదని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం స్పష్టం చేశారు. ఆదివారం నాడు అన్ని పాఠశాలల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని ఆయన పేర్కొన్నారు. సహపంక్తి భోజనానికి అయ్యే ఖర్చును మధ్యాహ్న భోజన పథకంలో చూయించాలని సూచించారు.

ఆదివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు యోగ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకత గురించి వివరించాలని విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న రాయితీలు, ఇతర సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement