నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇండియా సిమెంట్ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంది.
హైదరాబాద్: నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇండియా సిమెంట్ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంది. బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్‌తో సహా మిగతా నిందితులకు సమన్లు జారీ చేసింది. నవంబర్ 1న కోర్టు ఎదుట హాజరుకావాలని వారిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. విజయసాయిని పీటీ వారెంట్‌పై హాజరుపర్చాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.