మండుతున్న భానుడు!

Summer Heat Temperatures in Srikakulam - Sakshi

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

ఆందోళన చెందుతున్న ప్రజలు

శ్రీకాకుళం, ఆమదాలవలస: వేసవి పూర్తిగా రాకముందే భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఆందో ళన చెందుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నా యి. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండలకు కారణాన్ని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ జె.జగన్నాథం వివరించారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లోపగటి ఉష్ణోగ్రతలు 34, 35, 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగు తూ వస్తున్నాయన్నా రు. రాత్రి వేళల్లో 14 నుంచి 16 డిగ్రీల వర కూ నమోదవుతున్నాయన్నారు. పగటిపూట ఉష్ణోగ్రత కంటే రాత్రి పూట ఉష్టోగ్రతలు సగం కంటే ఎక్కువ వ్యత్యా సం ఉందన్నారు. దీనికి ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో పాటు పవనాలూ లేకపోవడమేనన్నారు. దీని కారణంగానే పొగమంచు కూడా కురుస్తోందని వివరించారు.

మంచు ప్రభావం మామిడి, జీడిమామిడి పూతపై ఉంటుందన్నా రు. ఈ పరిస్థితిలో యాజమాన్యం పద్ధతుల్లో మంచు నుంచి సోకుతున్న వ్యాధులకు తగిన మందులు వినియోగించాలని రైతులకు సూచిం చారు. పొడి వాతావరణ తేమగా ఉందని.. ఉద యం 6 గంటల సమయంలో 87 శాతం ఉన్నటు వంటి తేమ సాయంత్రమయ్యేసరికి 23 శాతానికి చేరుకుంటోందన్నారు. దీనికి సముద్రం వైపు నుంచి గాలులు వీయకుండా భూభాగం నుంచి మాత్రమే గాలులు వీయడమేనన్నారు. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వాస్తవంగా ఆరు నుంచి ఏడు పాయింట్లు ఉండాల్సి ఉండగా ప్రస్తు తం పది పాయింట్ల వరకు ఉంటోందని.. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం కాస్తున్న ఎండలో తిరిగే వారికి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు ఉంటుందన్నారు. 

బయటకు రాలేకపోతున్నాం
వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం పది గంటలు దాటితే రోడ్లపైకి రాలేకపోతున్నాం. పగటిపూట ఎండ, రాత్రయ్యే సరికి చలి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో అనా రోగ్యం పాలవుతున్నాం.
– పొన్నాడ రామారావు, ఆమదాలవలస

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top