విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించగా, అది రసాభాసగా మారింది. గిరిజన విద్యార్థులు శనివారం తమ సమస్యలపై మంత్రి సుజయ్ కృష్ణ రంగారావును కలిసేందుకు వచ్చారు.
అయితే పాలకవర్గ సమావేశం జరుగుతోందని విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.