కళాశాల ఆవరణలో విద్యుదాఘాతం కారణంగా ఓ విద్యార్థిని గాయాలపాలైంది.
కళాశాల ఆవరణలో విద్యుదాఘాతం కారణంగా ఓ విద్యార్థిని గాయాలపాలైంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న డి.సుజాత కళాశాల ఆవరణలో ఉన్న వేపచెట్టును పట్టుకోవడంతో విద్యుత్ ఎర్త్ వైరు తగిలి షాక్‌తో కింద పడిపోయింది. అక్కడే ఉన్న రాయి తగలడంతో గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.