రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | student died in road accident at badvel | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Apr 20 2015 11:27 AM | Updated on Nov 9 2018 4:36 PM

కడప జిల్లా బద్వేలు శివారులోని నెల్లూరు రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజి(13) అనే విద్యార్థి మృతిచెందాడు.

బద్వేలు : కడప జిల్లా బద్వేలు శివారులోని నెల్లూరు రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజి(13) అనే విద్యార్థి మృతిచెందాడు. రోడ్డుపై వెళుతున్న విద్యార్థిని వెనుక నుంచి వచ్చిన ఐషర్ వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అంజి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అంజి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఐషర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు ససేమిరా అనడంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement