బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సవతి తల్లి | Stepmother sets minor girl on fire in guntur district | Sakshi
Sakshi News home page

బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Jan 11 2014 12:18 PM | Updated on Aug 24 2018 2:33 PM

బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సవతి తల్లి - Sakshi

బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

ఈపూర్ మండలం బొగ్గరంలో శనివారం దారుణం చోటు చేసుకుంది. చంద్రమ్మ అనే బాలికపై సవతి తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించింది.

ఈపూర్ మండలం బొగ్గరంలో శనివారం దారుణం చోటు చేసుకుంది. చంద్రమ్మ అనే బాలికపై సవతి తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించింది. దాంతో మంటలను తట్టుకోలేక బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి...ఆమెను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చంద్రమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పోలీసులు బాలిక వద్ద వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

తాను ప్రస్తుతం మేనత్త ఇంటిలో ఉంటున్నానని, ఏకాదశ పర్వదినం కావడంతో స్నానం చేసి గుడికి వెళ్లాలని తన ఇంటికి వచ్చానని తెలిపింది.  తాను గదిలో బట్టలు తీసుకుంటుండగా తలుపు గడియ పెట్టి... మారుటి తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించిందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ప్రస్తుతం పరారీలో ఉన్న సవతి తల్లి కోసం గాలిస్తున్నారు.  చంద్రమ్మ పేరిట అర ఎకరం పొలం ఉందని, అది ఎలాగైనా సొంతం చేసుకోవాలనే సవతి తల్లి ఈ దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement