అనంతపురంలో16 వోల్వో బస్సులు సీజ్ | Statewide RTA Raids on 50 Private Travels-Buses Seized | Sakshi
Sakshi News home page

అనంతపురంలో16 వోల్వో బస్సులు సీజ్

Nov 25 2013 9:15 AM | Updated on Jun 1 2018 8:31 PM

నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలను పలు జిల్లాల్లో సుమారు 50కి పైగా బస్సులను అధికారులు సీజ్ చేశారు.

అనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలను పలు జిల్లాల్లో సుమారు 50కి పైగా బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 16 బస్సులను అడ్డుకున్నారు.  హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న 16 వోల్వో బస్సులను ఆర్టీఏ అధికారులు సోమవారం అనంతపురం వద్ద సీజ్ చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ అయిదు ప్రయివేటు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు టోల్గేట్ వద్ద డీటీసీ శ్రీదేవి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ప్రయివేట్ బస్సులతో పాటు, ఓవర్ లోడ్తో వెళుతున్న ఆరు లారీలను సీజ్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement