రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్లు | State-level hockey tournament begins | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్లు

Dec 12 2013 3:47 AM | Updated on Sep 2 2017 1:29 AM

పట్టణంలోని జిరాయత్ నగర్‌లో గల జావీద్ భాయ్ మినీ స్టేడియంలో బుధవారం హాకీ అండర్-19 బాల, బాలికల విభాగంలో. ..

ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్:  పట్టణంలోని జిరాయత్ నగర్‌లో గల జావీద్ భాయ్ మినీ స్టేడియంలో బుధవారం హాకీ అండర్-19 బాల, బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న జిల్లా జట్లను ఎంపిక చేశారు. హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హన్మంతు, జూనియర్ కళాశాలల ఆటల కార్యదర్శి గంగాధర్‌ల పర్యవేక్షణలో పీ ఈటీలు సురేందర్,  అంజు, అప్పారావు, ఆంజనేయు లు ఈ పోటీలు నిర్వహించారు.  జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలల క్రీడాకారులు పోటీ ప డగా అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు వారు చెప్పారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16, 17, 18 వ తేదీల్లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ జట్లకు మేనేజర్‌లుగా ఆంజనేయులు, రాహూల్, కోచ్‌గా అంజు వ్యవహరిస్తారన్నారు.
 
 బాలుర జట్టు..
 ఎం అజయ్(శాంకరీ జూనియర్ కళాశాల, నిజామాబాద్), ఎస్ మధు(ఎస్‌ఆర్, ఆర్మూర్), బి చందు(శ్రీనారాయణ, నిజామాబాద్), కె రాము(ప్రభుత్వ కళాశాల, తాడ్వాయి), పి దినేష్ గోల్‌కీపర్(ఎస్‌ఆర్ ఆర్మూర్), జి వినయ్ కుమార్(ఏపీ మోడల్, ఆర్మూర్), ఇ దినేష్(విజయ్ ఆర్మూర్), జి మనోజ్(ఏపీ మోడల్ ఆర్మూర్), ఎండీ మాజిద్(ఏపీఆర్‌జేసీ నిజామాబాద్), ఐ రాము(ఏపీ మోడల్, రెంజల్), కె కళ్యాణ్(ఏపీ మోడల్, ఆర్మూర్), ఎన్ శశాంక్ చంద్ర(ఆర్యభట్ట, కామారెడ్డి), ఒ కార్తీక్(ఏపీ  మోడల్,ఆర్మూర్), ఎన్ లక్ష్మణ్, బి యశ్వంత్(ఏపీ  మోడల్, రెంజల్), రాజేశ్(కామధేను, సిరికొండ)లు ఎంపికయ్యారు.
 
 బాలికల జట్టు
 బి రోషిణి(నరేంద్ర, ఆర్మూర్), డి లావణ్య(ఏపీఎస్‌డబ్ల్యూఆర్, తాడ్వాయి), బి ప్రసన్న లక్ష్మీ, పి వినీష, ఎన్ దివ్య(విజయ్ ఆర్మూర్), పి నవ్య, జి అఖిల(ఎస్‌ఆర్ ఆర్మూర్), ఎం రజిత, ఎ సుస్మిత, ఎన్ శివాణి ప్రియ, (ఆర్యభట్ట, కామారెడ్డి), శ్రావణి, గౌతమి(ఏపీ మాడల్, సిరికొండ), మంజుల(కామధేను, కామారెడ్డి), సీనాబాయి(శాంతి, ఆర్మూర్)లు ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement