వైద్యం వికటించి బాలింత మృతి | Staff nurse operation to Pregnant | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి బాలింత మృతి

Nov 3 2013 2:14 PM | Updated on Sep 2 2017 12:15 AM

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నర్సులు చేసిన నిర్వాకానికి వైద్యం వికటించి బాలింత మృతి చెందింది.

గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నర్సులు చేసిన నిర్వాకానికి వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. పురిటి నొప్పులు రావడంతో గర్భిణిని ఆమె బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ లేరు. ఇద్దరు నర్సులతో కలిసి స్టాఫ్ నర్సు ఆపరేష్ చేసింది. కవల పిల్లలు పుట్టారు. ఆ తరువాత మహిళకు రక్తస్రావం అయింది. నర్సులు చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందింది.

దాంతో  బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement