
సాక్షి, శ్రీకాకుళం : అడవి నుంచి వచ్చిన ఏనుగులు జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాలుగు ఏనుగులతో కూడిన గుంపు కొత్తూరు మండలం కుద్దిగాం, పొన్నుటూరు గ్రామాల మధ్య మొక్కజొన్న తోటల్లో సంచరిస్తుంది. ఏనుగుల గుంపు ఒకవేళ గ్రామాలవైపు వస్తే తమ పరిస్థితి ఏమిటని రెండు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు హిరమండలం బొంతసవర గ్రామ కొండపై ఎనిమిది ఏనుగులు తిరుగుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అడవి ఏనుగులను తరలించేందుకు జయంత్, వినాయక్ అనే ఏనుగులను అధికారులు రంగంలోకి దింపారు. వాటి సాయంతో అడవి ఏనుగులను తరలించడానికి ‘ఆపరేషన్ గజ’ చేపట్టారు. త్వరలోనే ఏనుగులను తరలిస్తామని అధికారులు చెప్తున్నారు.