వాహనమిత్ర రిజిస్ట్రేషన్‌లో రయ్‌రయ్‌! 

Srikakulam District Top In Registrations For YSR Vahana Mitra Scheme - Sakshi

రాష్ట్రస్థాయిలో శ్రీకాకుళం ముందంజ 

జిల్లాలో మొత్తం లబ్ధిదారులు 14,973 మంది 

ఈ ఏడాది కొత్తగా లబ్ధిపొందనున్న వారు 1434 మంది 

నేడు లబ్ధిదారుల ఖాతాలో జమ

శ్రీకాకుళం రూరల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి సంబంధించిన  రిజిస్ట్రేషన్లలో శ్రీకాకుళం జిల్లా ముందంజలో నిలిచింది. అధికారులు, సిబ్బంది చొరవ తీసుకుని నమోదు చేయించడంతో గత ఏడా దితో   పోల్చితే ఈ ఏడాది కొత్తగా 1434 మందికి ఈ పథ కం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆటో, టాక్సీలు కలిగి ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఇన్సూరెన్స్‌లు, టాక్స్‌లు, మరమ్మతులు నిమి త్తం ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నేడు (గురువారం) లబి్ధదారుల ఖాతాలో వాహనమిత్ర సొమ్ము జమ చేయనున్నారు. 

సచివాలయాలతో సులభతరం.. 
ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వాహనమిత్ర కోసం దరఖాస్తు చేసుకోవడం చాలామంది డ్రైవర్లకు సులభతరంగా మారింది. ఎన్ని పనులు ఉన్నప్పటికీ గ్రామ సె క్రటరీకు దర ఖాస్తు ఇవ్వడంతో పాటు ఆయన దగ్గరుండీ వా హనాన్ని పరిశీలించడం, వెంటవెంటనే ఆన్‌లైన్‌ చేయడంతో ఈ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యింది.  

సిక్కోలులోనే అధికం.. 
2019 అక్టోబర్‌లో ప్రారంభించిన వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఎంతో మంది ఆటో, టాక్సీ డ్రైవర్లకు చేయూతనిచ్చింది. ఈ పథకానికి గతేడాది 13,735 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 13,539 మందికి రూ.10వేలు ప్రోత్సా హకం లభించింది. గతేడాదిలో రెన్యువల్స్, ఈఏడాదిలో కొత్తగా  దరఖాస్తు చేసిన లబ్దిదారులు కలిపి 14,973 మందితో జాబితా ఖరారయ్యింది.  రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో కంటే శ్రీకాకుళంలోనే అత్యధికంగా రిజి్రస్టేషన్లు కావడం విశేషం. జిల్లాలో క్యాబ్స్, ఆటోలు కలిపి 30,804 వరకు ఉన్నాయి.   

సచివాలయాల  సిబ్బంది సహకారంతో.. 
నాకు సొంత ఆటో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో గతేడాది దరఖా స్తు చేయలేకపోయాను. ఈసారి ఆర్టీవో అధికారులు మార్గమధ్యలో తనిఖీలు చేస్తూ వా హనమిత్రకు దరఖాస్తుపై ఆరా తీశా రు. మా గ్రామంలో సచివాలయ సిబ్బంది ద్వారా వాహనమిత్రకు దరఖాస్తు చేశాను.  ఏడాది పూర్తికాకుండానే రెండోసారి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి టాక్సీ డ్రైవర్‌ అకౌంట్‌లో రూ.10వేలు వేయడం గొప్ప నిర్ణయం. 
–  కొంగరాపు సుధ, బైరివానిపేట 

ప్రత్యేక టీమ్‌తో.. 
జిల్లా కలెక్టర్‌ చొరవతో వైఎస్సార్‌ వాహనమిత్రను మరింత ముందు కు తీసుకుపోయాం. గత ఏడాది  వాహనమిత్ర టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. మళ్లీ వారితోనే ఈసారి కూడా రిజి్రస్టేషన్‌ ప్రక్రియను పూర్తి చేశాం. ప్రతిరోజూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్‌కు, జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం, ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఆర్టీవో కార్యాలయానికి వచ్చే ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల కోసం వాహన మిత్ర కౌంటర్‌ను ఏర్పాటు చేశాం. సమావేశాలతో పాటు రహదారి తనిఖీల్లోనూ డ్రైవర్లకు పథకంపై అవగాహన కలి్పంచాం. గ్రామ సచివాలయ సెక్రటరీ లకు ఎటువంటి అపోహాలు ఉన్నా వారిని విజయవా డ రవాణాశాఖ టెక్నికల్‌ టీమ్‌తో నేరుగా మాట్లాడించాం. టెక్నికల్‌ సమస్యలు తలెత్తితే ఎంపీడీఓలు, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం. 
– డాక్టర్‌ సుందర్‌ వడ్డీ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, శ్రీకాకుళం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top