రేపు శ్రీసూర్యనారాయణ స్వామి కల్యాణం | sri suryanarayana swamy kalyanostavam held tomorrow | Sakshi
Sakshi News home page

రేపు శ్రీసూర్యనారాయణ స్వామి కల్యాణం

Mar 7 2017 10:22 AM | Updated on Aug 20 2018 4:00 PM

రత్యక్షదైవం శ్రీసూర్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం మార్చి 8న అనివెట్టి మండపంలో జరగనుంది.

అరసవల్లి : ప్రత్యక్షదైవం శ్రీసూర్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం మార్చి 8న అనివెట్టి మండపంలో జరగనుంది. ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉషాపద్మినీ, ఛాయాదేవేరులతో స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించనున్నారు.

ఈ మేరకు ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. రూ.216 చెల్లించి కల్యాణం టికెట్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్యామలాదేవి తెలిపారు. ఈ నెల 8, 9, 10, 11వ తేదీల్లో స్వామి వారి విగ్రహాన్ని సూర్యుని లేలేత కిరణాలు స్పృశించే అవకాశముందని పేర్కొన్నారు. కిరణ ఆదిత్యున్ని భక్తులు తిలకించేలా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement