సభా వ్యవహారాలపై కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన కోడెల శివప్రసాదరావు తెలిపారు.
హైదరాబాద్: సభా వ్యవహారాలపై కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన కోడెల శివప్రసాదరావు తెలిపారు. స్పీకర్ అంటే మోనార్క్ కాదన్నారు. ప్రజా సమస్యలను చర్చించే విషయంలో సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు.
వీలైనంత త్వరగా నూతన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతుల గురించి ఆలోచించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. గతంలో టెంట్ల కింద సమావేశాలను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు నేడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.