మట్టి మాఫియా దూకుడుకు చిన్నారి బలి | soil mafia accident to child | Sakshi
Sakshi News home page

మట్టి మాఫియా దూకుడుకు చిన్నారి బలి

Mar 31 2014 3:34 AM | Updated on Sep 2 2017 5:22 AM

మట్టి మాఫియా దూకుడుకు చిన్నారి బలి

మట్టి మాఫియా దూకుడుకు చిన్నారి బలి

‘మమ్మీ..తొందరగా పదండి.. నానమ్మ చేసే ఉగాది పచ్చడి తినాలి.. డాడీ.. ఈ రోజు సన్‌డే.. స్కూల్ లేదు..తొందరగా రా..’ అంటూ కుమార్తె కోరడంతో ఊరికి ప్రయాణమైన ఆ కుటుంబం పై విధి చిన్నచూపు చూసింది.

కైకలూరు, న్యూస్‌లైన్ :‘మమ్మీ..తొందరగా పదండి.. నానమ్మ చేసే ఉగాది పచ్చడి తినాలి.. డాడీ.. ఈ రోజు సన్‌డే.. స్కూల్లేదు..తొందరగా రా..’ అంటూ కుమార్తె  కోరడంతో ఊరికి ప్రయాణమైన ఆ కుటుంబంపై  వి ధి చిన్నచూపు చూసింది.వారు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ పైకి మట్టి మాఫియాకు చెందిన ట్రాక్టర్ యమపాశంలా దూసుకువచ్చి చిన్నారి ప్రాణాలు బలిగొంది.
 
 పోలీసులతోపాటు పలువురిని కంటతడి పెట్టించిన ఈ హృదయ విదారక ఘటన ఆదివారం ఉదయం పల్లెవాడ చర్చి వద్ద జరిగింది.  సేకరించిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎన్నార్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న దారపురెడ్డి ఫణికుమార్ స్వగ్రామం ఏలూరు సమీపంలోని వట్లూరు. ఆరేళ్ల కిందట భార్గవిని వివాహం చేసుకున్నారు. వీరి ఏకైక కుమార్తె లక్ష్మీశర్వాణి(4) యూకేజీ చదువుతోంది. ఉగాదికి స్వగ్రామం రావాలని ఫణికుమార్ తల్లిదండ్రులు కోరడంతో భార్య, కుమార్తెతో కలిసి ఆదివారం ఉదయం మోటార్‌సైకిల్ పై బయలుదేరాడు.
 
 పల్లెవాడ గ్రామంలోని చర్చి వ ద్దకు రాగానే వదర్లపాడు నుంచి వస్తున్న మట్టి ట్రా క్టర్  బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురూ కింద పడిపోయారు. చిన్నారి తలకు బలమైన గాయమైంది. ఫణికుమార్ దంపతులు కూడా గాయపడ్డారు. ఆ స మయంలో వెనుక వస్తున్న చేపల రైతు ఉద్దరాజు రా మరాజు, డ్రైవర్ కారులో వారిని హుటాహుటిన కైకలూరు ప్రైవేటు అస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి లక్ష్మీశర్వాణి అప్పటికే చనిపోయిందని ని ర్ధారించారు. కైకలూరు సీఐ డి.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు.
 
 చిన్నారి చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు ముందుగా  చెప్పలేదు. బంధువులు వచ్చిన త ర్వాత ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వారి రోదనలు మిన్నంటాయి.‘ఇది కల అయితే ఎంత బాగుం డు’ అంటూ ఫణికుమార్ దంపతులు రోదించడం అందరి హృదయాలను కలిచివేచింది. పోస్టుమార్టం అనంతరం పాప మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పల్లెవాడ ప్రాంతంలో చేపల చెరువుల్లో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు నిబం ధన లు ఉల్లంఘించి వీటిని తవ్వుతూ ఇష్టారాజ్యంగా తర లిస్తున్నారని, ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement