కామర్స్‌ లెక్చరర్‌ కామ క్రీడ.. భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి.. | Commerce Lecturer Jashuva Episode Viral At Machilipatnam | Sakshi
Sakshi News home page

కామర్స్‌ లెక్చరర్‌ కామ క్రీడ.. భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి..

May 22 2026 10:55 AM | Updated on May 22 2026 2:23 PM

Commerce Lecturer Jashuva Episode Viral At Machilipatnam

సాక్షి, కృష్ణా: ​కామర్స్‌ పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్‌.. కామ వాంఛతో మితిమీరి ప్రవర్తించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని ప్లాన్‌ చేశాడు. అతడి ప్లాన్‌ బెడిసికొట్టడంతో రెడ్‌హ్యాండెడ్‌గా భార్యకు దొరికిపోయాడు. దీంతో, అందరి ముందే భర్తను భార్య చితకబాదింది. యువతిని బ్లాక్‌మొయిల్‌ చేసిందుకు పోలీసులు కామర్స్‌ లెక్చరర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామర్స్‌ లెక్చరర్‌ జాషువా గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో విధుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఓ యువతి.. కామర్స్ లెక్చరర్ జాషువాను ఆశ్రయించింది. దీంతో, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని జాషువా ప్లాన్‌ చేశాడు. యువతిని మచిలీపట్నంలోని తమ రూమ్‌కు రావాలని కోరాడు.

జాషువా వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఖంగుతిన్న యువతి.. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్‌ను ఆశ్రయించింది. అనంతరం, జాషువా నిజస్వరూపాన్ని లెక్చరర్ భార్యకు సమాచారమిచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన జాషువా భార్య.. లెక్చరర్ బాగోతాన్ని బట్ట బయలు చేసింది. ప్లాన్‌ ప్రకారం.. బాధితురాలితో రూమ్‌లో జాషువా ఉండగా.. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. అందరి ముందే తిక్క కుదిర్చింది. ఇక, బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు జాషువాను అదుపులోకి తీసుకున్నారు.  

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement