సోషల్ వర్క్ సబ్జెక్టు ప్రస్తుత సమాజంలో కీలకపాత్ర పోషిస్తోందని.. సామాజిక రుగ్మతలకు అడ్డుకట్ట వేసేందుకు, ఘర్షణలను నివారించేందుకు ఉపకరిస్తుందని ఆచార్య
సోషల్ వర్క్‌ది కీలకపాత్ర
Mar 12 2014 3:54 AM | Updated on Sep 2 2017 4:35 AM
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: సోషల్ వర్క్ సబ్జెక్టు ప్రస్తుత సమాజంలో కీలకపాత్ర పోషిస్తోందని.. సామాజిక రుగ్మతలకు అడ్డుకట్ట వేసేందుకు, ఘర్షణలను నివారించేందుకు ఉపకరిస్తుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వైపీ రామసుబ్బయ్య అన్నారు. యూనివర్సిటీ ఒంగోలు క్యాంపస్‌లో మంగళవారం నిర్వహించిన యూజీసీ జాతీయ స్థాయి సెమినార్ ముగింపు సభలో మాట్లాడారు. సామాజిక విలువలు, సామాజిక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో సోషల్ సబ్జెక్టుది కీలకపాత్ర అన్నారు.
నైపుణ్యత, మానవ వనరుల నిర్వహణ లో కూడా కీలక భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎన్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సెమినార్ల వలన విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం. హర్షప్రీతమ్ దేవ్‌కుమార్ మాట్లాడుతూ లక్ష్యాలను ఎలా ఛేదించాలో సెమినార్లు నేర్పిస్తాయన్నారు. సెమినార్ ట్రెజరర్ డాక్టర్ పి. వెంకట్రావు మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్థిక విధానాల్లో సోషల్ వర్క్ పాత్ర ఉంటుందన్నారు. యూనివర్సిటీ ఒంగోలు పీజీ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మండే హర్షప్రీతమ్ దేవ్‌కుమార్, సెమినార్ డెరైక్టర్ డాక్టర్ ఆర్. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement