సంఘ విద్రోహుల నీడ! | Social sabotage forces Attacks in srikakulam | Sakshi
Sakshi News home page

సంఘ విద్రోహుల నీడ!

Jan 6 2015 3:37 AM | Updated on Aug 15 2018 7:18 PM

సంఘ విద్రోహుల నీడ! - Sakshi

సంఘ విద్రోహుల నీడ!

జిల్లా కేంద్రంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డా యా?.. దాడులు, అరాచకాలకు పన్నా గం పన్నుతున్నాయా??.. పోలీసు అధికారులకు

శ్రీకాకుళం క్రైం: జిల్లా కేంద్రంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డా యా?.. దాడులు, అరాచకాలకు పన్నా గం పన్నుతున్నాయా??.. పోలీసు అధికారులకు ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలు దీనికి అవుననే సమాధానం చెబుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీ ఏఎస్ ఖాన్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావ్‌నాయుడు ఆధ్వర్యంలో పట్టణ సీఐ అప్పలనాయుడు, ఎస్సైలు భాస్కరరావు, రవి కుమార్, పోలీసు, ఏఆర్ సిబ్బందితో రంగంలోకి దిగి కార్డన్ సెర్చ్ చేపట్టారు. పట్టణంలోకి ప్రవేశించిన సంఘ విద్రోహ శక్తులు కలెక్టరేట్ సమీపంలోని వాంబే కాలనీలో షెల్టర్ పొందారన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆ కాలనీని జల్లెడ పట్టారు. కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి గురించి ఆరా తీశారు.
 
 అనుమానితులను రకరకాలుగా ప్రశ్నించి వివరాలు రాబట్టా రు. ఒకేసారి పెద్దసంఖ్యలో పోలీసు లు రావడం.. ఇంటింటికీ వెళ్లడం స్థాని కులను భయాందోళనకు గురి చేసింది. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కాలనీ మొత్తాన్ని కలియది రిగిన పోలీసులకు అనుమానితులెవరూ కనిపించలేదు. దాంతో కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. అపరిచితులు తిరుగుతున్న ట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఇళ్లు అద్దెకిచ్చినప్పు డు అవతలి వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దీనిపై సీఐ అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా సంక్రాంతి నేపథ్యంలో దొం గల ముఠాలు, పెద్ద నేరగాళ్లు వచ్చి ఉంటారన్న అనుమానంతో కార్డన్ సెర్చ్ జరిపామన్నారు. ఇక నుంచి ఇతర ప్రాంతాల్లోనూ అప్పుడప్పుడూ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement