ర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న స్మగ్లర్లకు పోలీసుల చర్యలు ముచ్చెమటలు పట్టిస్తున్నా యి.
నాయుడుపేట టౌన్: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న స్మగ్లర్లకు పోలీసుల చర్యలు ముచ్చెమటలు పట్టిస్తున్నా యి. నాయుడుపేటకు చెందిన టీడీపీ నేత వేముల రాజానాయుడి ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఇద్దరిని కూ డా అదేతరహాలో అదుపులోకి తీసు కుని విచారిస్తున్నట్లు సమాచారం.
రాజానాయుడి కదలికలపై పోలీసులు నెల రోజులుగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఆయనతో పాటు చిట్టమూరు మండలం యాకసిరి ప్రాంతానికి చెందిన ఒకరు, నాయుడుపేటకు చెందిన మరో వ్యక్తి కదలికలపైనా పోలీసులు దృష్టి సారించి పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
వీరు ముగ్గురూ పదేళ్లుగా ఎర్రచందనం సగ్లింగ్ చేస్తూ, అంతర్జాతీయ స్మగ్లర్లకు ప్రధాన అనుచరులుగా కొనసాగుతున్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురిని రహస్య ప్రాంతంలో విచారిస్తూ, వీరి వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. వీరు చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు, బినామీ పేర్లతో భారీ అపార్టుమెంట్లు, అధునాతన భవనాలు సమకూర్చుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజానాయుడికి సంబందించి అతని సమీప బంధువుల పేర్లతో నాయుడుపేటలో పలుచోట్ల ఆస్తులు కూడబెట్టినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అధికార పార్టీ వ్యక్తి కావడంతో, అతని వెనుక ఉన్న సూత్రధారులు బయటకు వస్తారా లేదా అన్నది చిక్కు ప్రశ్నగా మారింది. పోలీసులు ఇదే తరహాలో కఠినంగా వ్యవహరించి లోతుగా విచారణ జరిపితే అసలు సూత్రధారులందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది.