
సిరివెన్నెల రచన, బాలు గానం
గోదావరి పుష్కరాలపై ప్రత్యేక పాటను రూపొందించాలని ఏపీ ప్రభుత్వ అధికారుల అత్యున్నత స్థాయి కమిటీ తీర్మానించింది.
హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై ప్రత్యేక పాటను రూపొందించాలని ఏపీ ప్రభుత్వ అధికారుల అత్యున్నత స్థాయి కమిటీ తీర్మానించింది. పుష్కరాలపై కమిటీ ఈ రోజు సమావేశమైంది. పుష్కరాలపై ప్రత్యేక పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రితో రాయించాలని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాడించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పుష్కరాలపై ఒక డాక్యుమెంటరీని రూపొందించి సినిమా థియేటర్లలో, టీవీ ఛానెల్స్లో ప్రసారం చేయించాలని నిర్ణయించారు. పుష్కరాలలో వేయి మంది కూచిపూడి కళాకారులతో నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయాలని తీర్మానించారు.