శాంతియుతంగా విడిపోదాం | Simandhra against the movement .. | Sakshi
Sakshi News home page

శాంతియుతంగా విడిపోదాం

Aug 17 2013 3:10 AM | Updated on Sep 1 2017 9:52 PM

సీమాంధ్ర, తెలంగాణ భాయీ.. భాయీ. విడిపో యి కలిసుందాం.. అంటూ సద్భావన శాంతిసందేశాన్ని అందించేందుకు ఓరుగల్లు వేదికైంది.

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సీమాంధ్ర, తెలంగాణ భాయీ.. భాయీ. విడిపో యి కలిసుందాం.. అంటూ సద్భావన శాంతిసందేశాన్ని అందించేందుకు ఓరుగల్లు వేదికైంది. సీమాంధ్ర ఉద్య మానికి వ్యతిరేకంగా.. తెలంగాణ ఉద్యోగులపై దాడుల కు నిరసనగా శుక్రవారం టీజేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా టీఎన్జీఓలు, ఉద్యోగులు, న్యాయవాదులు, తెలంగాణవాదులు, జేఏసీల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ లు నిర్వహించారు. వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిం చారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండించారు. సంఘటన లు ఇలాగే జరిగితే ‘ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్’ నినాదాన్ని తీసుకోవాల్సి ఉంటుందని రాష్ర్ట బార్ కౌన్సిల్ మెంబర్ ముద్దసాని సహోదర్‌రెడ్డి హెచ్చరించారు. అనంతరం డీఆర్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్ర మం చేపట్టారు. తెలంగాణపై వెనక్కి తగ్గితే వచ్చే ఉద్యమాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష్, గుడిమల్ల రవికుమార్, అబ్దుల్‌నబీ, రాజేంద్రకుమార్, జనార్దన్‌గౌడ్, నీలా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

 పరకాలలో..
 పరకాలలో స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమరధామంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులను ఖండించారు. సహృద్భావ వా తావరణంలో విడిపోయేందుకు అన్ని వర్గాలు సహకరిం చాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు పున్నం రాజిరెడ్డి, నాయకులు నరేష్‌రెడ్డి, రాజ మౌళి, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 తొర్రూరులో..
 తొర్రూరు కోర్టు నుంచి న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరారు. కురవిలో తెలంగాణవాదులు సీమాంద్రుల దాడులను ఖండిస్తూ నిరసన తెలియజేశారు.

 ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో..
 అమరవీరుల స్థూపం వద్ద దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జైసింగ్ రాథోడ్, సమ్మయ్య, బానోతు బాలాజీ, సజ్జన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 ములుగురోడ్డులో..
 విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులపై దాడులపట్ల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. విద్యుత్ జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సంపత్‌రావు, నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement