రబీకి సిద్ధంగా ఉండాలి | Should be ready to rabi crop | Sakshi
Sakshi News home page

రబీకి సిద్ధంగా ఉండాలి

Aug 29 2013 6:19 AM | Updated on Oct 9 2018 6:34 PM

రాబోయే రబీ సీజన్‌కు సిద్ధం కావాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాబోయే రబీ సీజన్‌కు సిద్ధం కావాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో సులభంగా అధిగమించామని చెప్పారు. ఈ సీజన్‌లో 62 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 71వేల మెట్రిక్ టన్నులు పంపించామన్నారు. వీటితో పాటు డీఏపీ 20 వేల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 25 వేల టన్నులు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.
 
 ఈ సీజన్‌కు సరిపడా విత్తనాల పంపిణీ చేయడంతో ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 7.20 లక్షల హెక్టార్లలో సాగవుతోందన్నారు. ఈ సీజన్‌ను ఆదర్శంగా తీసుకుని రాబోయే రబీకి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే జిల్లాకు 77 వేల మెట్రిక్ టన్నుల వేరుశనగ విత్తనాల కోటాను మంజూరు చేశామని, అలాగే మరో 20 వేల టన్నుల పప్పుశనగలను పంపిస్తామన్నారు. ఇంకా కోటా కావాల్సి వస్తే నివేదికలు పంపిస్తే తక్షణమే మంజూరు చేస్తామన్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  
 
 మూడు లక్షల హెక్టార్లకు ప్రణాళికలు
 జిల్లావ్యాప్తంగా రబీలో మూడు లక్షల హెక్టార్లలో పంటలు సా గు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జేడీఏ రామరాజు కమిషనర్‌కు వివరించారు. ఇందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఆ ప్రకారమే కోటా మంజూరయిందన్నారు. కార్యక్రమంలో ఆత్మ పీడీ రవికుమార్, డీడీలు జయచంద్ర, రఘురాములుతో పాటు, ఏడీఏలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement