శోభానాగిరెడ్డికి అశ్రునివాళి | Shobha Nagi Reddy death: Leaders from all parties mourn loss | Sakshi
Sakshi News home page

శోభానాగిరెడ్డికి అశ్రునివాళి

Apr 26 2014 2:32 AM | Updated on Aug 30 2018 3:58 PM

రోడ్డు ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్‌సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగి రెడ్డి మృతిపై నెల్లూరు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆత్మకూరు, న్యూస్‌లైన్: రోడ్డు ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్‌సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగి రెడ్డి మృతిపై నెల్లూరు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అ భ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు మేయర్ అభ్య ర్థి అబ్దుల్ అజీజ్ శుక్రవారం ఆళ్లగడ్డకు చేరుకుని శోభానాగిరెడ్డి మృ తదేహానికి నివాళులర్పించారు. ఆమె భర్త నాగిరెడ్డిని ఓదార్చారు.
 
 పజలు, పార్టీకి శోభమ్మ సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ఆమె చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచిన ఆమె సేవలు మరువలేనివన్నారు. శోభమ్మ అకాల మృతి పార్టీకి తీరనిలోటన్నారు. పార్టీ ఓ మహోన్నత నాయకురాలిని కోల్పోయిందన్నారు. ఆ మెకు కర్నూలు జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement