ఈ నెల 29 నుంచి మూడు రోజులపాటు కృష్ణా జిల్లాలోని బెజవాడ కనకదుర్గమ్మకు శాఖంబరి ఉత్సావాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నర్సింగరావు ఆదివారం తెలిపారు.
విజయవాడ: ఈ నెల 29 నుంచి మూడు రోజులపాటు కృష్ణా జిల్లాలోని బెజవాడ కనకదుర్గమ్మకు శాఖంబరి ఉత్సావాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నర్సింగరావు ఆదివారం తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయాన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అలంకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన చెప్పారు. ఉత్సవాల ను ప్రతి రోజు లక్షమంది వీక్షించే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వివరించారు.
దుర్గమ్మకు తెలంగాణ బోణాలు
భాగ్యనగరానికి చెందిన బోనాల కమిటి ఆదివారం అమ్మవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా.. డప్పు చప్పుళ్లతో, మేళ తాళాలు, నృత్యాలతో విచ్చేసిన కమిటీకి ఆలయ ఈవో స్వాగతం పలికారు.